నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటం, ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టిన నాని, మరో కొత్త సినిమాను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన అసిస్టెంట్‌లను దర్శకులిగా పరిచయం చేసేందుకు సుకుమార్ రైటింగ్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్‌పై సుకుమార్ స్వయంగా వారిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు.కాగా తాజాగా సుకుమార్ అసిస్టెంట్‌లలో ఒకరైన శ్రీకాంత్‌ను డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.శ్రీకాంత్ ఓ అదిరిపోయే కథను రెడీ చేసి నానికి వినిపించాడట.
ఈ కథ నచ్చిన నాని శ్రీకాంత్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.
ప్రస్తుతం వి సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన నాని, టక్ జగదీష్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు.ఈ ప్రాజెక్టులను పూర్తి చేశాకే నాని-సుకుమార్ కాంబోలో మూవీ రానుంది.మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు నాని ఫ్యాన్స్.