పెళ్లి వీడియో టీజర్ వదిలిన హీరో నిఖిల్

కొత్త ఏడాదిలో యువ హీరోలైన నిఖిల్, నితిన్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వీరికి కరోనా పెద్ద ఆటంకం సృష్టించింది.

 Nikhil Marriage Movements Teaser, Tollywood, Telugu Cinema, South Cinema, Lock D-TeluguStop.com

ఈ నేపధ్యంలో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.అయితే నిఖిల్ సెంటిమెంట్ ప్రకారం అనుకున్న ముహూర్తానికి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుకని ముగించేసాడు.

పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా జరిగిపోయిన ఈ పెళ్లి వేడుకకి సంబందించిన మెమోరీస్ ని టీజర్ గా తన అభిమానులు, తెలుగు సినిమా అభిమానుల కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.

వెడ్డింగ్ మూమెంట్స్ మొత్తం సినిమా టీజర్ స్టైల్ లో రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఈ వీడియోలో నిఖిల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్ల ఆకట్టుకున్నాయి.కొత్తజీవితంలోకి అది కూడా తాను కోరుకున్న అమ్మాయితో అడుగుపెడుతున్న ఆనందం నిఖిల్ కళ్ళల్లో కనిపించింది.ఇక ఈ వీడియో షేర్ చేసి నా వివాహానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాలని భావించాను.ప్రస్తుత కొవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఈ వీడియోను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను.

మీ ఆశీస్సులు నాకు కావాలి.నాకు ఎంతో ఇష్టమైన పాట ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది అని నిఖిల్ వ్యాఖ్యానించాడు.

ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube