బాలయ్యని తండ్రిని చేస్తున్న బి గోపాల్

టాలీవుడ్ లో బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.వారి కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

 Balakrishna Play Father Role In B Gopal Movie, Tollywood, Telugu Cinema, South C-TeluguStop.com

అలాగే బాలకృష్ణ ని యాక్షన్ హీరోగా, డైలాగ్ కింగ్ తో బి గోపాల్ తెరపై ఆవిష్కరించాడు.ఈ మధ్య కాలంలో బి గోపాల్ దర్శకత్వంకి దూరంగా ఉన్నారు.

మూడేళ్ళ క్రితం గోపిచంద్ తో ఒక సినిమా చేశాడు.అది రిలీజ్ అయిన పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు.

ఇక చాలా గ్యాప్ తర్వాత మరలా బాలకృష్ణతో బి గోపాల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.బోయపాటి సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

దీని కోసం బి గోపాల్ టీం ఇప్పటికే కథని సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దే పనిలో ఉంది.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది.

ఇందులో బాలకృష్ణ ఓ యువతికి తండ్రిగా సరికొత్త తరహా పాత్రలో కనిపిస్తారని, ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ కథాంశంతో సినిమా ఉంటుందని తెలుస్తుంది.వయస్సు మళ్ళిన తండ్రి పాత్రలో కూతరు కోసం ఎలాంటి యుద్ధం చేశాడో ఈ సినిమాలో చూపించాబోతున్నట్లు సమాచారం.

బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రగా ఇది ఉంటుందని తెలుస్తోంది.ఇక సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి మాటలు అందిస్తున్నట్లు తెలుస్తుంది.

సమరసింహారెడ్డిలో ఆడపిల్లలకి అన్నగా బాలయ్యని చూపించిన గోపాల్ ఇందులో తండ్రి పాత్రలో ఇంకెలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube