గబ్బర్‌సింగ్‌ దర్శక నిర్మాత మద్య ముదురుతున్న మాటల యుద్దం

పవన్‌ కళ్యాణ్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రం విడుదల అయ్యి 8 ఏళ్లు అయిన సందర్బంగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.ఆ సమయంలో బండ్ల గణేష్‌ను హరీష్‌ శంకర్‌ విస్మరించాడు.

 Bandla Ganesh, Harish Shankar, Pawan Kalyan, Gabbar Singh, Twitter, Naga Babu, B-TeluguStop.com

నిర్మాతను అయిన నేను ఆయనకు ఆఫర్‌ ఇచ్చాను.అలాంటిది నా పేరు చెప్పక పోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను.

ఎక్కడో ఉన్న వాడికి నేను ఛాన్స్‌ ఇచ్చానంటూ బండ్ల గణేష్‌ చేసిన వ్యాఖ్యలపై హరీష్‌ శంకర్‌ తీవ్రంగానే స్పందించాడు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Gabbar Singh, Harish Shankar, Naga Babu, Paw

నాకు బండ్ల గణేష్‌ ఆఫర్‌ ఇవ్వలేదు.నాగబాబు గారు మొదట ఆ సినిమాను నిర్మించాలనుకున్నారు.ఆయనే నాకు ఆఫర్‌ ఇచ్చారు.

నేను ప్రాజెక్ట్‌లోకి వెళ్లిన తర్వాత నిర్మాత మారాడు.ఆయనే ఫ్లాప్స్‌లో ఉన్న సమయంలో నేను సక్సెస్‌ ఇచ్చానంటూ కామెంట్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్‌ స్పందించాడు.ఈసారి దర్శకుడు హరీష్‌ శంకర్‌ పేరు ఎత్తకుండా బండ్ల గణేష్‌ విమర్శలు గుప్పించాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ వారిద్దరి మద్యే కనుక బండ్ల గణేష్‌ ట్వీట్స్‌ ఖచ్చితంగా హరీష్‌ శంకర్‌ గురించే అంటున్నారు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Gabbar Singh, Harish Shankar, Naga Babu, Paw

ట్విట్టర్‌లో బండ్ల గణేష్‌.తింటున్నంత సేపు ఇస్తారాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు.నీతో అవసరం ఉన్నంతసేపు వరుసలు కలిపి మాట్లాడుతారు.

అవసరం తీరాక లేని మాటలు అంటకడుతారు.శత్రువుకు మన విజయాలే కాదు, అపజయాలు కూడా తెలియాలి.

అప్పుడే మనం వాటిని ఎదిరించి ఎలా నిలబడ్డామో కూడా తెలుస్తుంది అంటూ ట్వీట్‌ చేశాడు.ఈ మాటల యుద్దం మరెంతగా ముదురుతుందో అనే ఆసక్తికర చర్చ మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube