కేజీఎఫ్ లో దొంగతనంకి వెళ్లి ముగ్గురు మృతి

రాకింగ్ స్టార్ యష్ హీరోగా కన్నడంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్.ఈ సినిమా కన్నడంతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది.

 Three On Gold Hunt Enter Kgf Sink, Die, Karnataka, Kgf Movie, Kgf , Kannada-TeluguStop.com

ఈ సినిమా కారణంగా కర్నాటకలోకి కేజీఎఫ్ గోల్డ్ మైనింగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసిందే.సినిమా కథ అంతా కల్పితమే అయిన కొలార్డ్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ కి సంబందించిన చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేశారు.

ఇప్పటికే కర్నాటకలో బంగారం తవ్వకాలు ఆ మైనింగ్ లో జరుగుతున్నాయి.తాజాగా కేజీఎఫ్ మైనింగ్ మరోసారి వార్తలలోకి వచ్చింది.

లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ కూడా ఐదుగురు దొంగలు చోరీకి యత్నించడం, వారిలో ముగ్గురు మరణించడం కలకలం రేపింది.

కుప్పం సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న కేజీఎఫ్ గనుల్లో ఇనుప సామగ్రి దొంగతనం చేసేందుకు ఐదుగురు వ్యక్తులు వెళ్లారు.

వారు గనుల్లో 100 అడుగుల లోతుకు వెళ్లగా, అక్కడ ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో ఊపిరి అంధక ఉక్కిరిబిక్కిరయ్యారు.వారిలో ముగ్గురు అక్కడే ప్రాణాలు వదలగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.

దొంగలు పెద్దగా కేకలు వేయడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.లాక్ డౌన్ అమల్లో ఉండడంతో గత కొన్నివారాలుగా కోలార్ ప్రాంతంలో బంగారం వెలికితీత పనులు నిలిచిపోగా ఇదే అదనుగా చోరీ చేద్దామని ప్రయత్నించిన దొంగలు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube