జగన్ పై మోదీ అభిప్రాయం ఇలా ఉందా ?

జగన్ ఓ మొండిఘటం.తన మాటే నెగ్గాలి అనుకుంటాడు కానీ ఎవరి మాటా వినే రకం కాదు.

 Pm Narendra Modi, Ys Jagan,corona, Ap, Harshavardhan,-TeluguStop.com

అందరూ తన బాణీలో నడవాలి అనుకుంటాడు కానీ, తాను ఎవరి రూట్లోనూ వెళ్ళాలి అనుకోడు.సొంతంగా తానే ఒక బ్రాండ్ అన్నట్టుగా జగన్ బావిస్తూ ఉంటారు.

ఇలా జగన్ వ్యక్తిత్వం గురించి జనాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఉన్న అభిప్రాయం.నిజమే జగన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటుంది.

జగన్ ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచి ఇదే రకమైన వ్యవహార శైలితో ఉంటూ వస్తున్నారు.ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ సరికొత్త శైలిలో ముందుకు వెళ్తున్నారు.

ఎన్నికల హామీలను కూడా మొదటి ఆరు నెలల్లోనే అమలుచేసి జగన్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది.

జగన్ పాలన జనరంజకంగా సాగుతుంది అనుకునే సమయంలో ఆకస్మాత్తుగా కరోనా విపత్తు వచ్చి పడింది.

దీని కారణంగా ఎక్కడికక్కడ సేవలు స్తంభించిపోయాయి.

ఈ సమయంలో జగన్ కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకుంటారు ? అలాగే సంక్షేమ పథకాలు అమలును నిలిపి వేస్తారా ? ఇలా అనేక సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.కానీ జగన్ సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూనే, మరోపక్క కరోనా ను కట్టడి చేయడంలోనూ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంలోనూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ విషయంలో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం జగన్ విధానాన్ని పాటిస్తూ, ఆయనను ప్రశంసిస్తూ వస్తున్నారు.అందరికంటే ముందుగా జగన్ చేస్తున్న ప్రతిపాదనలు, సూచనలను ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నా, చివరికి జగన్ చెప్పిన విధంగానే దేశవ్యాప్తంగా అందరూ పాటిస్తున్నారు.

ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జగన్ బాటలోనే నడుస్తున్నారు.

-Telugu Political News

అసలు ప్రధానమంత్రి కంటే ముందుగానే ఏపీ సీఎం జగన్ కరోనా తో కలిసి మనం మరి కొంతకాలం సహజీవనం చేయాల్సిందే అని చెప్పడం పై పెద్ద రాద్దాంతం జరిగింది.అయితే జగన్ చెప్పిన తర్వాత ఇదే విషయంపై ప్రధాని మోదీ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాల అధిపతులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో జగన్ చెప్పిన దాంట్లో నిజం ఉందని అందరికీ అర్థమైంది.తాజాగా జరిగిన ఓ సమావేశంలో జగన్ దేశం, రాష్ట్రం సమర్థవంతంగా ముందడుగు వేయాలి అంటే ఆర్థిక ఉద్దీపన ముఖ్యమని చెప్పారు.

ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీని ని బాగా ఆకర్షించింది.ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జగన్ కు ఫోన్ చేసి మరీ ప్రధాని మెచ్చుకున్నారనే విషయాన్ని చెప్పారట.

ఇవే కాకుండా జగన్ అనుసరిస్తున్న విధానాలు అన్నిటినీ ప్రధాని మోదీ పరిశీలనలోకి తీసుకుంటున్నారట.మొత్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, సూచనలు, ప్రతిపాదనలు అన్ని ప్రధాని బాగా ఆకర్షిస్తున్నాయనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ విధానాలను ఎప్పటికప్పుడు మోదీ పరిగణలోకి తీసుకుంటూ జగన్ విధానాలను మోదీ ఫాలో అవుతున్నారు అనే విషయం ఇప్పుడు వైసీపీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube