రెడీ అయిన ఎన్టీఆర్ వీడియో.. ఇక దుమ్ములేపడమే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

 Ntr First Look Video From Rrr Ready, Ntr, Rrr, Rajamouli, First Look Video, Ntrb-TeluguStop.com

ఈ క్రమంలోనే పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తారక్‌లు కలిసి చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదట.

ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో తారక్ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా తారక్ ఫస్ట్ లుక్ ఉంటుందా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది.ఈ క్రమంలోనే తారక్ పుట్టినరోజైన మే 20న ఈ సినిమాలోని అతడి ఫస్ట్ లుక్ వీడియో కాకుండా కేవలం విషెస్ మాత్రమే చెబుతారని వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్ వీడియో టీజర్ రెడీ అయ్యిందట.

ఈ వీడియో అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ అంటోందట.

తారక్ పాత్రకు సంబంధించిన విజువల్స్, డైలాగులు పీక్స్‌లో ఉంటాయట.ఇక తారక్ చేసే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా మనకు చూపిస్తారట.

ఈ వీడియో టీజర్ ఔట్‌పుట్‌తో జక్కన్న ఫుల్ హ్యాపీగా ఉన్నాడట.తారక్‌ను కొమురం భీం పాత్రలో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమని ఆయన అంటున్నాడు.

మొత్తానికి జక్కన్న తారక్‌ను చూపించే విధానం రికార్డు సృష్టించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.మరి తారక్ ఫస్ట్ లుక్ వీడియో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో తెలియాలంటే మే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube