భూముల వేలంకు సిద్దమయిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్దం అవుతోంది.జగన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవరత్నాల హామీలు ఇచ్చిన విషయం తెల్సిందే.

 Ap Government Ready For Auction Of Land Ap Governament, Ap Elections, Gunture An-TeluguStop.com

ఆ హామీని నెరవేర్చేందుకు జగన్‌ ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను వేలం పాట వేసేందుకు సిద్దం అవుతున్నారు.పెద్ద ఎత్తున హామీలు నెరవేర్చేందుకు భూములను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఉన్న జగన్‌ అందుకు సంబంధించిన జీవోను ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆ భూముల ఖరీదు 210 కోట్లుగా నిర్ణయించారు.

గుంటూరు మరియు విశాఖ జిల్లాల్లోని పలు ఖరీదైన ఏరియాల్లో ఈ భూములను ఖరారు చేయడం జరిగింది.గుంటూరు జిల్లా నల్లపాడులో 6.7 ఎకరాల భూములు, శ్రీనగర్‌ కాలనీలోని 5.44 ఎకరాలు, మెయిన్‌ బీటీ రోడ్డు 1.72 ఎరకాలను వేలంకు సిద్దం చేశారు.ఇక విశాఖలో చిన్న గడీలో 1 ఎకరం, ఫకీర్‌ టకియా 1.04 ఎకరాలు, ఆగనం పూడి 50 సెంట్ల భూమిని వేలంకు రెడీ చేస్తున్నట్లుగా జీవో విడుదల చేశారు.ఈ అన్ని ఏరియాల్లో కూడా మార్కెట్‌ ధర భారీగా ఉంది.కనుక భారీ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube