తిరుమల దేవస్థానంలో విచిత్రమైన పరిస్థితి

ప్రపంచంలోనే అత్యంత భారీ ఆదాయం వచ్చే దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అనే విషయం తెల్సిందే.ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారు.

 Latest Update Of Ttd Employes About Salary, Ttd, Coronavirus, Lock Down, Temple-TeluguStop.com

అయితే గత రెండు నెలలుగా కరోనా కారణంగా పూర్తిగా దర్శనాలు నిలిచి పోయాయి.గతంలో ఎప్పుడు కూడా కనీసం కొన్ని గంటల పాటు కూడా దర్శనానికి బ్రేక్‌ ఇచ్చేవారు కాదు.

కాని ఇప్పుడు ఏకంగా రెండు నెలలుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. దాంతో రోజుకు కోటిన్నర నుండి రెండు కోట్ల ఆదాయం మాయం అయ్యింది.

ఆదాయం లేకపోవడంతో టీటీడీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.గత నెలలో మూల నిధి నుండి తీసి ఇచ్చినా ఈసారి మాత్రం అది సాధ్యం కావడం లేదు.

టీటీడీ అధికారులు ఈ విషయంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం ఈ విషయంలో టీటీడీకి సాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.ఇటీవల వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా టీటీడీ ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.అందులో ప్రభుత్వం నుండి టీటీడీ ఉద్యోగులకు జీతాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఏపీ ప్రభుత్వం వద్ద కూడా ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులే ఉన్నాయి.కనుక టీటీడీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనుమానమే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube