కరోనా రోగులకు చికిత్స: కార్లతో భారీ పరేడ్, భారత సంతతి వైద్యుడికి అమెరికన్ల సెల్యూట్

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.లక్షల సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారడంతో పాటు ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తుండటంతో అమెరికన్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

 America, New York, Corona Virus, Dr. Avinash, Social Media, New Jersey Medical H-TeluguStop.com

ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అక్కడి వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.ఇప్పటికే పలువురు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా.

మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ లిస్టులో భారత సంతతి వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఉన్నారు.

తమ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా శ్రమిస్తున్న వైద్యులకు అమెరికన్లు సెల్యూట్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలపడంతో పాటు వాహనాలతో పెరేడ్ నిర్వహించి ఇంటికొచ్చి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ అవినాశ్ కూడా ఇలాంటి గౌరవమే దక్కింది.న్యూయార్క్‌లోని రట్జర్స్‌ న్యూజెర్సీ మెడికల్ హాస్పిటల్స్‌లో అవినాశ్ కోవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఇరుగుపొరుగు వారితో పాటు స్నేహితులు, అధికారులు అవినాశ్‌కు డ్రైవ్ ఆఫ్ హానర్ సమర్పించారు.వాహనాలతో భారీ పెరేడ్ నిర్వహిస్తూ… వారంతా చేతులు ఊపుతూ, చప్పట్లు కొడుతూ, గౌరవ వందనం చేస్తూ ముందుకు కదిలారు.

ఇంటిముందు గార్డెన్‌లో నిలబడి అవినాశ్ వారికి నమస్కరించారు.

డాక్టర్ అవినాశ్ అడిగా బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య విద్యను అభ్యసించారు.

రట్జర్స్ న్యూజెర్సీ మెడికల్ స్కూల్‌లో క్రిటికల్ కేర్, న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ మెడికల్ సెంటర్లలో ఫెలోగా ఉన్నారు.డ్రైవ్ ఆఫ్ హానర్‌కు సంబంధించిన వీడియోను అవినాశ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా.

అది వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube