స్టాండప్ కమెడియన్ గా పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా వరుసగా స్టార్ హీరోలతో జత కడుతూ సినిమాలు చేస్తున్న మంగళూరు భామ పూజాహేగ్దే. ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా మూడు సినిమాలకి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 Pooja Hegde Stand Up Comedian Role In Most Eligible Bachelor Movie, Hero Akhil,-TeluguStop.com

అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఒకటి.ఇక ఈ సినిమా షూటింగ్ లతో లాక్ డౌన్ తర్వాత పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉండబోతుంది.

మరో రెండేళ్ళ పాటు ఏ సినిమాకి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఈ అమ్మడు లేదు.అయితే కొత్త సినిమాలతో దర్శకులు వస్తున్న ఆమె డేట్స్ దొరకడం లేదు.

మొత్తానికి ఈ అమ్మడు స్టార్ రేంజ్ సౌత్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిపోతుంది.

ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీతో పాటు తెలుగులో అఖిల్ కి జోడీగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్ సినిమాలో పూజాహేగ్దే నటిస్తుంది.

ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో ఆమె పాత్ర తెలుగులో ఇప్పటి వరకు రాని విధంగా ఉండనుంది.స్టాండప్‌ కమెడియన్‌గా పూజా ఈ సినిమాలో ప్రేక్షకుల్ని నవ్వించనున్నట్టు సమాచారం.నార్త్ ఇండియా, అది కూడా హైఫై సొసైటీలో భాగా పాపులర్ అయిన స్టాండప్‌ కామెడీ జోనర్ అనేది తెలుగు సినిమాకి కొత్త అని చెప్పాలి.

ఈ బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ ని భాస్కర్ ఎలా డిజైన్ చేశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. తెలుగులో స్టాండప్ కామెడీ షోలు ఉన్నాకూడా అంతగా పాపులర్ కాలేదు.

అయితే ఈ మధ్యనే ఒక చిన్న సినిమాలు కమెడియన్ పాత్రని స్టాండప్ లో చూపించారు.మరి ఇందులో భాస్కర్ చేసిన ఈ ప్రయోగం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube