రేట్లు పెంచినా తగ్గేది లేదంటున్న మందు బాబులు...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దాదాపుగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేశారు.

 Liquor Sales, Liquor Sale Profits, Andhra Pradesh, Telangana, 1000 Crores-TeluguStop.com

దీంతో గత కొద్ది రోజులుగా మద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న మందు బాబులు ఒక్కసారిగా గా వైన్ షాపులకు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు.అంతేగాక ఎలాగైనా సరే మద్యం కొనుగోలు చేసిన తర్వాతే ఇంటికి వెళ్లాలని భీష్మించుకుని మద్యం దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు.

దీంతో ఇప్పటికే పలు రాష్ట్ర ఖజానాలు మద్యం ఆదాయంతో కళకళలాడుతున్నాయి.

ఇప్పటి వరకు మద్యం అమ్మకానికి అనుమతులు జారీ చేసిన ప్రాంతాల్లో నమోదు అయినటువంటి ఆదాయ గణాంకాలను పరిశీలిస్తే దాదాపుగా దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం చేకూరినట్లుగా సమాచారం.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 200 కోట్లకు పైగా సమకూరినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను అరికట్టేందుకు దాదాపుగా 75% శాతం వరకు రేట్లను పెంచింది.

అయినప్పటికీ మద్యం అమ్మకాల జోరు మాత్రం తగ్గడం లేదు.

అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేసిన ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజా సంఘ నాయకులు మరియు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక  మద్యం కొనుగోలు చేసే టువంటి వ్యక్తుల వివరాలు నమోదు చేసుకుని వారికి లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ సహాయ పథకాలను అమలు చేయకూడదని అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube