అజిత్ కి విలన్ గా ఆర్ ఎక్స్ హీరో ఫిక్స్ అయినట్లే

సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అజిత్.తమిళంలో అతనికి ప్రస్తుతం ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Karthikeya Nagitive Role In Ajith Movie, Tollywood, Kollywood, South Cinema, Gee-TeluguStop.com

అతని సినిమా మార్కెట్ లోకి వచ్చింది అంటే భారీ హైప్ ఉంటుంది.ఈ మధ్య కాలంలో రెగ్యులర్ హీరోల తరహాలో కాకుండా లుక్స్ విషయంలో కొత్తదనం చూపిస్తూ యాక్షన్ హీరోగా ఇరగాదీస్తున్న తలైవ అజిత్ ప్రస్తుతం వినోత్ దర్శకత్వంలో వాలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇది కూడా యాక్షన్ కథాంశంతోనే తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా షూటింగ్ రామోజీలో జరుగుతూ ఉండగాన్ లాక్ డౌన్ పడటంతో వాయిదా పడింది.

ఇక ఇందులో విలన్ గా ఆర్ ఎక్స్ 100తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కార్తికేయ పేరు ప్రముఖంగా వినిపించింది.ఇప్పటికే కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.

ఒక వైపు హీరోగా చేస్తూనే మంచి పాత్రలు వస్తే విలన్ గా కూడా చేయడానికి రెడీగా ఉండటంతో కార్తికేయని నెగిటివ్ రోల్స్ కోసం దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయను తీసుకోనున్నారనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.

అజిత్ పుట్టిన రోజున ఆయనకి కార్తికేయ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆయన వాలిమై చేయడం ఖాయమైపోయిందనే టాక్ బలాన్ని పుంజుకుంది.ఇక తెలుగులో కార్తికేయ గీతా ఆర్ట్స్ 2లో చావుకబురు చల్లగా సినిమా చేస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube