‘హిట్‌’తో ఏకంగా బన్నీకే గాలం వేస్తున్నాడే

విశ్వక్‌ సేన్‌ హీరోగా వచ్చిన హిట్‌ చిత్రం కమర్షియల్‌గా సూపర్‌ హిట్‌ కాకున్నా కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అయితే వచ్చింది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.

 Sailesh Kolen Impressed The Allu Arjun  By His Movie Story, Allu Arjun, Sailesh-TeluguStop.com

ఒక చిన్న సబ్జెక్ట్‌ను దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన తీరు బాగుంది అంటూ విమర్శకుల ప్రశంసలు పొందాడు.చక్కని స్క్రీన్‌ప్లేతో సినిమాను ఎక్కడ బోర్‌ కొట్టించకుండా సస్పెన్స్‌ను చివరి వరకు రివీల్‌ కాకుండా సినిమాను తెరకెక్కించి మెప్పించాడు.

అందుకే ఈ దర్శకుడితో వర్క్‌ చేసేందుకు పలువురు యంగ్‌ హీరోలు ఆసక్తిగా ఉన్నారు.

దర్శకుడు శైలేష్‌ కొలనుతో నాని కూడా ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని, హిట్‌ సినిమా సమయంలోనే నానికి స్క్రిప్ట్‌ చెప్పి మెప్పించాడని తెలుస్తోంది.

ఇదే సమయంలో దర్శకుడు శైలేష్‌ మెగా హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు కూడా స్టోరీ వినిపించినట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక స్టైలిష్‌ స్టోరీ లైన్‌ను బన్నీకి ఈయన వినిపించడం బన్నీ కూడా ఇంప్రెస్‌ అవ్వడం జరిగిందట.

త్వరలోనే ఖచ్చితంగా సినిమా ఉంటుందని అంటున్నారు.

Telugu Allu Arjun, Nani, Sailesh Kolanu, Sukumar Bunny, Tollywood, Viswak Sen-Mo

స్టోరీ లైన్‌ బాగుండటంతో తప్పకుండా సినిమా చేద్దామంటూ చెప్పడంతో స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడట.నానితో లేదంటే అల్లు అర్జున్‌తో ఈయన సినిమా ఉంటుందని తెలుస్తోంది.ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది.పుష్ప చిత్రం తర్వాత శైలేష్‌ కొలను తయారు చేసిన స్క్రిప్ట్‌ బాగుంటే దీంతోనే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

బన్నీని కనుక మెప్పిస్తే శైలేష్‌ కొలను దశ తిరిగినట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube