మోడీపై మళ్లీ విరుచుకు పడ్డ ఓవైసీ

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించే సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుందంటూ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శలు గుప్పించాడు.ఎలాంటి ప్లానింగ్‌ లేకుండా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా కూడా వలస కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా ఓవైసీ ఆరోపించారు.

 Hyderabad Mp Assaduddin Owaisi Comments On Narendra Modi, Corona Virus, Immigrat-TeluguStop.com

పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉంది.వారు కనీసం తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారంటూ ఓవైసీ అభిప్రాయపడ్డారు.

కూలీ పనుల కోసం వలస వెళ్లిన వేలాది మందికి రేషన్‌ కార్డులు కాని కనీసం బ్యాంకు అకౌంట్‌ కూడా లేదు.వారికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేస్తుంటూ ఓవైసీ ప్రశ్నించాడు.

వారికి ఆధార్‌ కార్డు ఆధారంగా అయినా సాయం చేయాలంటూ డిమాండ్‌ చేశాడు.ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసి వలస కూలీల జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు.

గోడౌన్లలో ఉన్న లక్షల టన్నుల బియ్యంను వలస కూలీలకు పంచాల్సిందిగా ఆయన కేంద్రంను డిమాండ్‌ చేశాడు.మోడీ అనాలోచిత నిర్ణయంతో కొన్ని లక్షల మంది ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube