జగన్ ఆతిథ్యాన్ని ఎప్పటికి మరిచిపోలేను... చిరంజీవి ఆసక్తిక వాఖ్యలు

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కి చిరంజీవికి మంచి అనుబంధం ఏర్పడింది.ఓ పక్క చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మీద ఒంటి కాలి మీద లేచి విమర్శలు చేస్తూ ఉన్నారు.

 Chiranjeevi Praises Ap Cm Jagan Invitation, Tollywood, Ap Politics, Ysrcp, Janas-TeluguStop.com

చీటికి మాటికి ఫ్యాక్షన్ లీడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరో వైపు జగన్ కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ మూడు పెళ్ళిళ్ళు అంటూ విమర్శలు చేస్తున్నారు.

అయితే రాజకీయాలకి దూరం అయిన తర్వాత చిరంజీవి మాత్రం జగన్ కి దగ్గరయ్యారని ఈ మధ్య కాలంలో చిరంజీవి వ్యవహారం చూసిన వారికి అర్ధమవుతుంది.సైరా నరసింహా రెడ్డి సినిమా సమయంలో జగన్ ని ఇంటికి వెళ్లి కలవడం, తర్వాత మూడు రాజధానులకి మద్దతు ఇవ్వడం, జగన్ పరిపాలన మీద ప్రశంసలు కురిపించడం చేస్తున్నాడు.

అయితే చిరంజీవి వ్యవహారం జనసేన పార్టీకి రాజకీయంగా కాస్త ఇబ్బందికరంగానే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి చిరంజీవి జగన్ పై పొగడ్తలు కురిపించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు దశాబ్ధాలుగా స్నేహపూర్వక సంబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.గతంలో వైఎస్ భారతి ఆహ్వానం మేరకు సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమానికి కూడా హాజరయ్యానని తెలిపారు.

భారతి తనను అద్భుతంగా రిసీవ్ చేసుకుందని తెలిపారు.అలాగే జగన్ ప్రమాణ స్వీకారానికి తనను ఆహ్వానించారని కానీ హాజరు కాలేకపోయానని తెలిపారు.ఏపీ పోరుబిడ్డ సైరా నరసింహారెడ్డి సినిమాను సీఎం జగన్ కు చూపించాలని తాను జగన్ అపాయింట్ మెంట్ కోరానన్నారు. జగన్ తనను ఇంటికి ఆహ్వానించారని, తన భార్య సురేఖతో వెళితే జన్మలో మరిచిపోలేని ఆతిథ్యాన్ని జగన్-భారతి ఇచ్చారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

అయితే ఓ విధంగా చిరంజీవి జగన్ అందిచిన ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పిన ఈ విషయాన్ని మరోసారి సారి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది అని మాత్రం తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube