హైడ్ అండ్ సీక్ ఆడుతూ వాషింగ్ మిషన్ లో దాక్కున్న యువతి, చివరికి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం తో వందకు పైగా దేశాలు లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే.దీనితో అందరూ కూడా ఇంటిపట్టునే ఉంటూ పెద్దవాళ్లు తమ తమ విధులను నిర్వర్తిస్తూ ఉండగా పిల్లలు,యువతులు మాత్రం బోర్ కొట్టకుండా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.

 Teen Girl Gets Stuck In Washing Machine During Game Of Hide-and-seek Gone Wrong-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక యువతి తన అక్కా చెల్లెళ్ల తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఏకంగా వాషింగ్ మిషన్ లో దూరింది.ఇక ఆతరువాత దానిలో నుంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం తో చివరికి రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి తంటాలు పడి ఎలాగో బయటకు తీయగలిగారు.

ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.లాక్ డౌన్ లో భాగంగా రోజుల తరబడి ఇళ్లలో ఉండాలంటేనే ఉండలేక కొందరు జనాలు నిబంధనలను ఉల్లఘించి రోడ్లపై తిరుగుతున్నారు.

కొందరు ఇలా బోర్ కొట్టకూడదు అని ఇంటిలోనే ఆడుకుంటున్నారు.అలా ఆలోచించే అమెరికా లో అమరి డాన్సీ అనే 18 ఏళ్ల యువతి తన అక్క చెల్లెళ్ళ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడింది.

అయితే ఈ ఆట బాగా ఆడి ఎవ్వరికి దొరకకూడదని అనుకుందో ఏమోగానీ ఏమీ దొరకనట్లు వాషింగ్ మెషీన్‌లోకి దూరి దాక్కోవడానికి ప్ర‌య‌త్నించింది. వాషింగ్ మెషిన్ విస్తీర్ణం ఇరుకుగా ఉన్న‌ప్ప‌టికీ అదేదీ ప‌ట్టించుకోకుండా ఎలాగోలా ఆడాలి అన్న ఉద్దేశ్యం తో దూరేసింది.

కానీ, బయ‌ట‌కు మాత్రం రాలేక‌పోయింది.దీంతో ఆమె సోద‌రి ఇంట్లోవాళ్ల‌కు విష‌యం చెప్పింది.అయితే ఆమెను ఎలా ర‌క్షించాలో ఎవ‌రికీ అర్థం కాక‌పోప‌వ‌డంతో ఎమ‌ర్జెన్సీ నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయడం తో రెస్క్యూ సిబ్బంది వచ్చి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నించి సుర‌క్షితంగా ఆమెను బ‌య‌ట‌కు తీశారు.దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ విష‌యం గురించి మాట్లాడుతూ….’అప్ప‌టికే అన్ని చోట్లా దాక్కున్నాం.

కాబ‌ట్టి ఈసారి కొత్త చోటు వెతుక్కుందామ‌ని వాషింగ్ మెషీన్‌లోకి దూరాను.కానీ, నేను బ‌య‌టికి వ‌స్తానో లేదోన‌ని భ‌యంతో చ‌చ్చిపోయాను’ అని రెస్క్యూ నుంచి బయటపడిన అమ‌రీ డాన్సీ తెలిపింది.

బహుశా ఇదేనేమో అసలైన లాక్ డౌన్ అంటే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube