ప్రతి ఏటా లాక్ డౌన్ ? ఇన్ని లాభాలు ఉన్నాయా ?

గతంలో ప్రపంచ మానవాళి ఎప్పుడు చూడని విపత్తులు ఇప్పుడు చూస్తోంది.కరోనా ప్రభావంతో ప్రపంచమంతా అల్లాడుతోంది.

 Air Pollution, Ganga River, Lockdown,water Purified, Lockdown Every Year,kcr,cor-TeluguStop.com

దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రపంచమంతా లాక్ డౌన్ అంటూ ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు.అత్యవసర సేవలు మినహా సంస్థ కార్యకలాపాలు అన్ని నిలిపోయాయి.

అసలు ఇటువంటి నిబంధనలు గాని, పరిస్థితులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రజలు ఎవరు గతంలో ఎప్పుడూ చూడకపోవడంతో ఇదో పెద్ద వింతగా కనిపిస్తోంది.అయితే అసలు లాక్ డౌన్ వల్ల లాభ నష్టాలు ఏంటి అనేది విశ్లేషిస్తే, ప్రజలకు ప్రస్తుతానికి ఇబ్బంది ఎదురైనా, పర్యావరణం పరంగా చూసినా, ప్రజలు ఆరోగ్యరీత్యా దీని వల్ల ఉపయోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అసలు ఈ కరోనా వైరస్ విపత్తు రాకపోతే ప్రపంచం ఎన్నో గొప్ప విషయాలను పాఠాలను చవి చూసే అవకాశం లేకుండా పోయేది.

ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజీ గానే ఉంటున్నారు.

క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.ఎవరి జీవితం వారిదే అన్నట్టుగా ఒకరికొకరు సంబంధాలు లేకుండా బతికేస్తున్నారు.

ఇక సాంకేతికపరంగా కూడా ప్రపంచమంతా అభివృద్ధి చెందింది.ప్రకృతిని సవాల్ చేసే స్థాయిలో శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలో అనుకోకుండా ప్రపంచ మానవాళికి ఇప్పుడు సవాల్ విసురుతోంది కరోనా.ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఔషధాలు ఏవి కనిపెట్టలేదు.

ఈ సంగతి పక్కన పెడితే కాలుష్య కోరల్లో కూరుకు పోయిన గంగానది వంటి పవిత్ర నది మొన్నటివరకు కాలుష్య కోరల్లో చిక్కి పోయి ఉంది.కానీ లాక్ డౌన్ నిబంధనలు మొదలైన 10 రోజుల తర్వాత 50 శాతానికి పైగా గంగానది శుద్ధి అయింది.

పరిశ్రమలు మూతపడడంతో వ్యర్ధాలు ఏవి గంగానదిలో కలిసే అవకాశం లేకపోవడం, పిండ ప్రదానాలు, ఇతర కాలుష్య కారకాలు లేకపోవడంతో ఇప్పుడు గంగానది గతంలో ఎప్పుడు చూడని విధంగా మారిపోయింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు.

మొన్నటి వరకు అత్యంత ప్రమాదకరమైన రీతిలో కాలుష్యం పెరిగిపోయింది.కానీ ఇప్పుడు పూర్తిగా అక్కడ పరిస్థితి మారిపోయింది.

అక్కడ సాధారణ వాతావరణం కనిపిస్తోంది.ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా కనిపిస్తున్నారు.

జంక్ ఫుడ్ కు ప్రజలు పూర్తిగా దూరంం అయ్యారు.ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని తింటూ ఆరోగ్యం గా ఉంటున్నారు.

మద్యం దుకాణాలు మూతపడడంతో మందు బాబులంతా ఇంటికే పరిమితం అయిపోతున్నారు.జనాాల్లో పొదుపు బాగా పెరిగింది.

కుటుంబ బంధాలు బాగా బలపడ్డాయి.కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటో ప్రజలకు బాగా అర్థమైంది.

లాక్ డౌన్ నిజంగా ఒక గుణపాఠం నేర్పింది.ఎలా బతకాలి అనే అనుభవం నుంచి ఇలా కూడా బతకవచ్చు అన్న విధంగా పెద్ద గుణపాఠం నేర్పింది.

Telugu Air, Corona Effect, Ganga River, Lockdown, Purified-Telugu Political News

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాాక్ డౌన్ ను ప్రతి ఏటా నిర్వహిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వస్తున్నారు.ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటేేే ఈ కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా వదిలిపోయినా లాక్ డౌన్ ను ప్రతి ఏటా కొద్ది రోజుల పాటు పాటించడం వల్ల ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube