సెల్ఫ్ క్వారంటైన్‌ నిబంధనల ఉల్లంఘన: సింగపూర్‌లో తెలుగు వ్యక్తిపై కేసు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసిన దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి.చైనాలో వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి అప్రమత్తమైన ఆ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.

 Coronavirus: Indian Man Charged By Singapore Court For Breaching Self-quarantine-TeluguStop.com

వైరస్ గురించి తెలియగానే సింగపూర్ ప్రభుత్వం టీవీలు, మొబైళ్లు, రేడియోల ద్వారా సమాచారం అందించింది.ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని.

లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

దీంతో ప్రజలు స్వచ్ఛందంగా హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోవడం మొదలుపెట్టారు.

దీనితో పాటు ప్రజలు వీధుల్లో గుమిగూడటంపైనా నిబంధనలు విధించింది.బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా దగ్గరగా కూర్చుంటే 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది.

ఇదే సమయంలో అనుమానితులు, కరోనా సోకిన వారిని క్వారంటైన్‌కు పంపింది. ఇలాంటి పరిస్ధితుల్లో సెల్ఫ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఓ భారతీయుడిపై కేసు నమోదు చేశారు అక్కడి అధికారులు.

Telugu Chaina Corona, Quarantaine, Quarantine, Singapoore, Vardhireddy-Telugu NR

వర్ధిరెడ్డి నాగేశ్వరరెడ్డి అనే 35 ఏళ్ల భారతీయుడిని ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు ఐసోలేషన్ వార్డులో ఉండాలి.కానీ అతను ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఫిబ్రవరి 24న బయటకు వచ్చినట్లు స్ట్రయిట్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.శుక్రవారం నాటికి సింగపూర్‌లో 623 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,050కి పెరిగింది. విదేశీ కార్మికులు వసతి పొందే హాస్టల్స్ ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతోందని అధికారులు తెలిపారు.సెల్ఫ్‌ క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు నాగేశ్వరరెడ్డి నేరాన్ని అంగీకరించాడు.

ఈ నేపథ్యంలో ఈ నెల 23న కోర్టు ముందు విచారణకు హాజరుకానున్నాడు.ఇదే రకమైన కేసులో మరో ఇద్దరు విదేశీయులపైనా కేసు నమోదైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube