విడ్డూరం : బయటకు వెళ్తే ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు, ఇక్కడ ట్విస్ట్‌ ఏంటో తెలుసా?

బుద్ది లేని గాడిదలు ఎంత చెప్పినా విని చావడం లేదు.వినకుండా ఎంతో మందిని చంపుతున్నారు.

 Maharashtra Police Arrange Selfie Points For Who Breaks Lock Down Rules , Mahara-TeluguStop.com

అడ్డ గాడిదలకు ఏదో విధంగా బుద్ది చెప్పాలని పోలీసులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.కొడితే రెండు రోజుల తర్వాత ఆ దెబ్బలు తగ్గి మళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు.

అందుకే కనీసం రెండు మూడు వారాలు అయినా గుర్తుండి పోయేలా ఉండాలనే ఉద్దేశ్యంతో పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు.లాక్‌డౌన్‌ సమయంలలో బయట తిరుగుతున్న వారికి బుద్ది చెప్పేందుకు మహారాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న విధానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

మహారాష్ట్ర కొల్లాపూర్‌లో పలు చోట్ల సెల్ఫీ జోన్‌లను ఏర్పాటు చేశారు.ఎవరైనా బయట తిరిగితే వారిని తీసుకు వెళ్లి సెల్ఫీ జోన్‌లో సెల్ఫీ తీసుకోవాలంటారు.వాటిని పోలీసులు తీసుకుని తమ ఫేస్‌బుక్‌ పేజీల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.అలాగే వారి ఫేస్‌బుక్‌ పేజీల్లో కూడా అప్‌లోడ్‌ చేయిస్తున్నారు.

సెల్ఫీ అప్‌లోడ్‌ చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు కదా.అసలు విషయం ఏంటీ అంటే ఆ సెల్ఫీ వెనుక నేను బుద్ది తక్కువ వాడిని, నాకు బాధ్యత లేదు, నేను చావుకు కూడా సిద్ద పడ్డాను.నేను ఒక స్వార్థపరుడిని నా స్వార్థం నేను చూసుకుని బయటకు వచ్చాను అంటూ ఉంటుంది.

Telugu Lockdown, Maharashtra, Selfie-

ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు వస్తే అతడి కుటుంబ సభ్యులు ఇంకా మిత్రులు అంతా కూడా చూసి నవ్వుతారు.కొందరు అతడిపై అసహ్యం పెంచుకుంటారు.అలా కొందరు బయటకు రాకుండా ఉంటున్నారంటూ మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు.

లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నా ఉప్పుకు, పప్పుకు అంటూ బయటకు వస్తున్న వారికి పోలీసులు ఇలా బుద్ది చెబుతున్నారు.
ఇంట్లో బోర్‌ కొట్టి వందలాది మంది ఇలా బయట తిరగడం కరోనాను మోసుకుని వారి కుటుంబ సభ్యులకు అంటించడం చేస్తున్నారు.

ఇది మామూలు విషయం కాదు.అందుకే ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవ్వాంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చేతులు ఎత్తి దండం పెడుతున్నారు, చివరకు ఇలాంటి పని కూడా చేశారు.ఇంకా ఏం చేస్తే వారిలో మార్పు వస్తుందో.

చిన్న చిన్న అవసరాలకు బయటకు వెళ్లవద్దంటే వెళ్తూనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube