ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అందాల భామ పాయల్ రాజ్‌పుత్, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది.అయితే ఆ సినిమాలో అమ్మడి అందాలకు ఫిదా అయిన కుర్రకారు, ఆమెను ఆ పాత్రలో తప్ప వేరే పాత్రల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుని, ఆ ముద్ర చెరిపేసే ప్రయత్నం చేస్తోంది.
కాగా పాయల్ ఇటీవల మాస్ రాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రంలో నటించింది.
అయితే ఆ సినిమాలో అమ్మడికి పెద్ద ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించలేదని చెప్పాలి.ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పాత్ర కావడంతో ఎక్కువ ఫోకస్ రవితేజపైనే పెట్టారు.దీంతో అమ్మడిని పట్టించుకున్నవారు లేరు.కానీ పాయల్ మాత్రం ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంది.
అదేంటి.సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యాక ఇప్పుడు ప్రమోట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా.
ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉండటంతో ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ, డిజిటల్ ప్లాట్‌ఫాంలో డిస్కో రాజా చిత్రాన్ని చూస్తూ తాజాగా ఓ వీడియో తీసింది.ఈ సినిమాలో తన పాత్రను ఇమిటేట్ చేస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతుంది.