రిటైర్మెంట్ ప్రకటించిన కొరటాల.. ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి తన సత్తా చాటిన కొరటాల శివ, వరుసబెట్టి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు.కొరటాల చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఆయన డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు మొదలుకొని స్టార్ హీరోల వరకు ఆసక్తి చూపుతున్నారు.

 Koratala Siva, Acharya, Ntr, Retirement-TeluguStop.com

ఈ క్రమంలో ప్రస్తుతం కొరటాల డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తు్న్నాడు.ఆచార్య చిత్రాన్ని సోషల్ మెసేజ్‌తో కూడుకున్న ఓ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల.

ఇక ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇలాంటి సమయంలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ కొరటాల తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు.

మరో ఐదేళ్లలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు కొరటాల తెలిపారు.ఈ విషయం తెలుసుకుని అందరూ అవాక్కయ్యారు.

ఇది సహజంగానే జరిగే ప్రక్రియ అని, అందరూ ఏదో ఒక సమయంలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అని కొరటాల చెప్పుకొచ్చారు.కాగా ఈ ఐదేళ్లలో తన మైండ్‌లో ఉన్న సినిమాలను తెరకెక్కించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube