ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బిల్‌ గేట్స్‌

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ భయాందోళనలు కలిగిస్తున్న ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి కీలక ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ప్రస్తుత సమయంలో నిధులను ఆపేయడం చర్చనీయాంశం అవుతుంది.

 Microsoft Chief Bill Gates Comments On Donald Trump, America Corna Virus, Bill G-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా దేశాలను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తున్న సంస్థకు ఈ సమయంలో ఎక్కువగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.కాని అమెరికా మాత్రం ఈ సమయంలో నిధులు ఆపేయడం దారుణం అంటూ ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా ఈ విషయమై మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ స్పందించారు. ప్రస్తుత సమయంలో డబ్ల్యూహెచ్‌ఓకు నిధులను ఆపేయడం ప్రమాదకర నిర్ణయం అంటూ ఆయన అభిప్రాయ పడ్డాడు.

కరోనా విస్తరించకుండా డబ్ల్యూహెచ్‌ఓ కృషి చాలా ఉందని అన్నారు. ఆ సంస్థ చేస్తున్న పనిని మరే సంస్థ చేయలేదని, ఈ సమయంలో ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేయవద్దంటూ ట్రంప్‌కు బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి చేశారు.

చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ పని చేస్తుందనే ఆగ్రహంతోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.మరి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్న విమర్శలతో అయినా ట్రంప్‌ వెనక్కు తగ్గుతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube