సుధీర్ తో కలిసి పని చేయడం అమేజింగ్ అంటున్న రష్మీ.... అందుకేనా....

ఇటీవల కాలంలో టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేగాక సమాజంలో జరిగేటువంటి పలు విషయాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలు ఇస్తోంది.

 Rashmi Gautam, Sudigali Sudheer, Tollywood, Love Affair, Gossips,-TeluguStop.com

అయితే తాజాగా రష్మి గౌతమ్ సోషల్ మీడియా మధ్య మైనటువంటి ట్విట్టర్ ఖాతాలో తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.ఇందులో భాగంగా తన అభిమానులు అడిగినటువంటి పలు రకాల ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక నెటిజన్ బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుధీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెబుతారంటూ ప్రశ్నించాడు.అయితే ఈ ప్రశ్నకి రష్మి గౌతమ్ సమాధానం చెబుతూ సుడిగాలి సుధీర్ తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంటుందని రిప్లై ఇచ్చింది.

దీంతో నెటిజనులు ఈ విషయాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

అయితే గతంలో కూడా సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు బలంగా వినిపించాయి మరియు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ సుధీర్, రష్మీలు మాత్రం తాము మంచి స్నేహితులని తమ మధ్య ప్రేమ, గీమ ఏమీ లేవని  అలాగే మా మధ్య ప్రేమాయణం నడుస్తోందని వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మి గౌతమ్ టాలీవుడ్ ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” మరియు సౌత్ ఇండియా నంబర్ వన్ డాన్స్ షో “డీ” లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

మరోపక్క అడపాదడపా సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube