టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి తమన్నా.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదిహేను సంవత్సరాలు దాటిపోయిన ఇప్పటికి ఈ భామ తన హవా చూపిస్తూనే ఉంది.
ప్రస్తుతం గోపీచంద్ కి జోడీగా సిటీమార్ అనే సినిమాలో తమన్నా నటిస్తుంది.అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు.
ఎప్పుడు సినిమా షూటింగ్ లు, పార్టీలు అంటూ తిరిగే సెలబ్రిటీలకి ఇంటి దగ్గర ఉండటం అంటే కొద్దిగా కష్టమైన పని అని చెప్పాలి.అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇందులో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు.
సామాన్యులు మాత్రం లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉండటం అంటే కాస్తా చిరాకు తెప్పించే విషయమే.అయితే ఇంటి దగ్గర ఉన్న బోర్ కొట్టకుండా సలహాలు ఇస్తా అంటుంది తమన్నా.
లాక్ డౌన్ అనేది అందరికి పరీక్షా సమయం లాంటిది.ఇప్పుడే మనం స్ట్రాంగ్ గా వుండాలి.పెదవులపై చిరునవ్వు చెదరనీయకూడదు.ఇంట్లో వాళ్లతో భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఆనందకరంగా వుండాలి.
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకోవాలి.ఇవన్నీ నేను చేస్తున్నాను.
మీరు కూడా చేయండి.ఎలాంటి బోర్ కొట్టదు.
నమ్మకపోతే ఒక సారి ట్రై చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది అంటూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి సలహాలు ఇచ్చేస్తుంది.