ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తన మొదటి సినిమా హీరోని ప్రేమించి ఏకంగా పెళ్లి చేసుకుంది.ఆ సినిమాతో పాటు వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి అందులో ఒక్కటి తప్ప మిగిలిన మూడు సినిమాలు సూపర్ హిట్స్.
ఇక పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా మజిలీ.ఇది చైతూ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పాలి.
ఇక పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న సమంత మరోసారి భర్త నాగ చైతన్యతో రొమాన్స్ కి రెడీ అవుతుంది.
ఆ మధ్య ఓ బేబీ సినిమాతో సోలోగా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సమంత మళ్ళీ నందిని రెడ్డి దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యింది.
ఈ సినిమాలో సమంతకి జోడీగా చైతన్య అయితే బాగుంటుందని అని నందిని రెడ్డి భావించడంతో అతనిని హీరోగా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ మూవీ ఒక కొరియన్ మూవీ రీమేక్ గానే తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఎమోషనల్ డ్రామాగా ఉండబోయే ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని సమాచారం.త్వరలో ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.