లాక్ డౌన్ లో దూసుకెళ్లిన జూమ్, టిక్ టాక్... భారీగా పెరిగిన ఆదాయం

కరోనా విజృంభించడంతో ప్రపంచంలో అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు.

 Zoom Becomes Most-downloaded Android App In India, Tiktok, Lock Down, Corona Eff-TeluguStop.com

ఇక కంపెనీల కార్యకలాపాలు ఇంటి నుంచి జరుగుతూ ఉండటంతో పనుల గురించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ తో వచ్చిన జూమ్ యాప్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.

ఈ యాప్ సాయంతో 50 మంది వరకు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో విధులు నిర్వర్తిస్తున్నవారికి ఇదొక అద్భుతమైన అవకాశం అయ్యింది.

దాంతో ఈ యాప్ డౌన్ లోడ్లు రాకెట్ లా దూసుకుపోయాయి.

మార్చిలో ఓ వారం రోజుల్లో జూమ్ యాప్ ను 62 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఇది ఏ స్థాయిలో దూసుకెళ్ళిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.ఇక దీంతో పాటు చైనా నుంచి దిగుమతి అయిన మరో ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్ వినియోగం కూడా ఈ లాక్ డౌన్ సమయంలో విపరీతంగా పెరిగింది.

దీంతో సాఫ్ట్ వేర్ కంపెనీలు సంపద కోల్పోతే వీరి ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిపోయింది. జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ ఆస్తి విలువ ఏకంగా ముప్పై వేల కోట్లకి ఈ మూడు నెలల కాలంలో పెరిగిపోయింది.

టిక్ టాక్ సిఈఓ/ ఆదాయం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ లాక్ డౌన్ సీజన్ కొంత మంది వ్యాపార దిగ్గజాలని భారీగా దెబ్బతీస్తే ముందుచూపుతో ఆలోచించిన చైనాకి చెందిన జూమ్, టిక్ టాక్ వ్యాపార దిగ్గజాలు మాత్రం తమ సంపదని పెంచుకున్నారు అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube