ఆకలి బాధలు చూసి చలించిపోయా అంటున్న శ్రీకాంత్

కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ప్రజలలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఆకలి అనుభవిస్తున్నారు.ముఖ్యంగా రోజు కూలి మీద ఆధారపడి బ్రతికే పేదవాళ్ళు పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

 Hero Srikanth Share A Video On Corona Crisis, Tollywood, Telugu Cinema, Lock Dow-TeluguStop.com

ఇదే పరిస్థితి రోజువారి బెటాల మీద బ్రతికే సినిమా కార్మికులపై కూడా పడింది.రోజు షూటింగ్ కి వెళ్తే కాని పూటగడవని స్థితిలో ఎంతో మంది సినీ కార్మికులు ఉన్నారు.

ఇప్పుడు వారందరూ లాక్ డౌన్ కారణంగా ఆకలి బాధలు అనుభావిస్తున్నారు.అలాంటి వారి బాధలు తెలుసుకున్న చిరంజీవి కార్మికుల కొడం చారిటీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు.

ఆ చారిటీ ద్వారా కార్మికులకి సాయం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే చిత్రపురి కాలనీలో తాను ఆకలి బాధను చూశానని, పేదల ఆకలిని తీర్చేందుకు తాను, తన స్నేహితులు కృషి చేశామని నటుడు శ్రీకాంత్ ఒక వీడియో పోస్ట్ చేశాడు.

సినీ రంగాన్ని ఆశ్రయించి జీవనం సాగిస్తున్న ఎంతో మంది బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఇప్పుడు ఆకలి బాధను తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, ఎంతో మంది ఇప్పటికే వారికి సాయం చేస్తున్నారని తెలిపారు.తనకు విషయం తెలిసి వెళ్లి, వారి ఆకలి బాధను స్వయంగా తిలకించి చలించిపోయానని, వారికి ఆహారం అందించామని వెల్లడించారు.

కరోనా విలయతాండవం ఆడుతున్న వేళ ప్రాణాలకి తెగించి డ్యూటీ చేస్తూ పోలీసు సిబ్బంది, డాక్టర్లు, జీహెచ్ఎంసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube