ఆర్ఆర్ఆర్‌పై లాక్‌డౌన్ ఎఫెక్ట్.. తేల్చేసిన నిర్మాత!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మల్టీ్స్టారర్ మూవీపై తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 No Postpone Of Rrr, Rrr, Rajamouli, Ntr, Ram Charan, Lock Down, Dvv Danayya-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తు్న్నాడు.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్, చరణ్ ఫస్ట్ లుక్‌లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్‌లతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలు ఉండటంతో ఈ సినిమా షూటింగ పనులు వాయిదా పడ్డాయి.

దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేక మరోసారి వాయిదా వేస్తారా అనే ప్రశ్న సర్వత్రా ఏర్పడింది.ఇప్పటికే ఈ సినిమాను జూలై 30, 2020 నుండి జనవరి 8, 2021కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా మెజారిటీ శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ఇకపై రిలీజ్ వాయిదా వేసే ప్రసక్తే లేదని చిత్ర నిర్మాత డివివి దానయ్య తెలిపారు.ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జనవరి 8న రిలీజ్ చేసి తీరుతామని ఆయన తేల్చేశారు.

రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube