బర్త్‌డే గిఫ్ట్‌ కోసం సుకుమార్‌పై పెరుగుతున్న ఒత్తిడి

అల్లు అర్జున్‌ బర్త్‌డే రాబోతుంది.ఈనెల 8వ తారీకున ఫ్యాన్స్‌ భారీ ఎత్తున బర్త్‌డే వేడుకలు నిర్వహించాలని భావించారు.

 Allu Arjun, Sukumar, Firstlook, Birthday, Allu Arjun Movie, Bunny Birthday-TeluguStop.com

అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన కారణంగా ఈసారి బన్నీ పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకడం కన్ఫర్మ్‌ అనుకున్నారు.కాని కరోనా వైరస్‌ కారణంగా బర్త్‌డే వేడుకలు పూర్తిగా రద్దు చేశారు.

బర్త్‌డే వేడుక నిర్వహించాలన్నా కనీసం కేక్‌లు దొరికే పరిస్థితి లేదు.ఇలాంటి సమయంలో కనీసం సోషల్‌ మీడియాలో అయినా బన్నీ బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకోవాలని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి అయ్యింది.

అయితే ఆ షెడ్యూల్‌లో బన్నీ పాల్గొన్నాడా లేదా అనే విషయం తెలియదు.మార్చి నుండి సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా వైరస్‌తో మొత్తం తలకిందులు అయ్యింది.

ఈ సమయంలో బన్నీ బర్త్‌డేకు సుకుమార్‌ నుండి పోస్టర్‌ను ఆశించవచ్చా అనేది కొందరి ప్రశ్న.అయితే బన్నీ మాత్రం ఖచ్చితంగా బర్త్‌డేకు ఒక మంచి గిఫ్ట్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.

Telugu Allu Arjun, Bunny, Firstlook, Sukumar-Movie

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సోషల్‌ మీడియాలో సుకుమార్‌పై చాలా ఒత్తిడి ఉందట.తప్పకుండా బన్నీ లుక్‌ను కాని బన్నీ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని కాని ప్రకటించి తీరాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారట.ఈ నేపథ్యంలో సుకుమార్‌ ఫస్ట్‌లుక్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందతోంది.ఇదే సమయంలో టైటిల్‌ ను కూడా రివీల్‌ చేస్తాడని సమాచారం.

ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకే ఈ సినిమాకు లారీ అనే టైటిల్‌ను కూడా అనుకుంటూ ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube