హైడ్రాక్సి క్లోరోక్విన్‌ కోసం భారత ఫార్మా కంపెనీలకు ఆర్డర్లు: క్యూకడుతున్న దేశాలు

ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇప్పటి వకు ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు గాను ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

 Indian Firms Ipca, Zydus Cadila,chloroquine, Covid-19, Us, Pharma Companies-TeluguStop.com

ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో కరోనాకు విరుగుడుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్న వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.

ఈ నేపథ్యంలో భారతదేశానికి చెందిన అగ్రశ్రేణి ఔషధ తయారీ కంపెనీలైనన ఇప్కా లాబొరేటరీస్, జైడస్ కాడిలా‌లకు అమెరికా పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది.కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు గాను యాంటీ మలేరియల్ ఔషధం క్లోరోక్విన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.

కరోనా వైరస్‌‌కు చికిత్స చేయడానికి క్లోరోక్విన్‌ను గేమ్ ఛేంజర్‌గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు.హైడ్రాక్సి క్లోర్‌క్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు గాను ఇప్కా‌పై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఎత్తివేసింది.

Telugu Chloroquine, Covid, Pharma, Zydus Cadila-

మరోవైపు జైడస్ కాడిలాకు కూడా అమెరికా ఆర్డర్ ఇచ్చింది.కరోనా వైరస్ రోగులతో క్లినికల్ ట్రయల్స్‌ క్రింద క్లోరోక్విన్‌ను పరీక్షించేందుకు తాము సిద్ధమవుతున్నట్లు ఎఫ్‌డీఏ కమీషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్‌ తెలిపారు.హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సల్ఫేట్, క్లోరోక్విన్‌ ఫాస్పేట్‌ దిగుమతికి ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చినట్లు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇప్కా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు తెలియజేసింది.అమెరికాతో పాటుగా సదరు రెండు సంస్థలు క్లోరోక్విన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆర్డర్లను పొందుతున్నాయి.

క్లోరోక్విన్ ఫాస్పేట్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్‌ల కోసం అత్యవసర డిమాండ్ నేపథ్యంలో అనేక దేశాల నుంచి తాము ఆర్డర్లను పొందుతున్నట్లు ఇప్కా స్టాక్ ఎక్స్చేంజ్‌లకు లేఖ రాసింది.ఈ క్లిష్ట సమయంలో మానవాళికి సాధ్యమైనంత సాయం చేస్తామని కంపెనీ తెలిపింది.

దీనిపై జైడిస్ కాడిలా ప్రతినిధి మాట్లాడుతూ… ఈ ఔషధాన్ని పెద్ద పరిమాణంలో తయారు చేయగల సామర్ధ్యం ఉన్న ప్రపంచంలోని అతికొద్ది కంపెనీలలో తాము ఉన్నందున మానవాళి అవసరాలను తీర్చగలమని భావిస్తున్నట్లు తెలిపారు.క్లోరోక్విన్ భారత్‌లో విస్తృతంగా అందుబాటులో ఉంది.

దేశంలో ఇప్కా, జైడిస్ కాడిలా, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ సహా పలు కంపెనీలు దీనిని తయారు చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube