ఏపీలో మరో సర్వే జగన్ కీలక నిర్ణయం ? ఎందుకంటే ?

ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా ప్రభుత్వ పనితీరు నాయకుల పనితీరు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై ప్రైవేట్ సర్వే తో పాటు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి దానికనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండేలా జగన్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.అదే విధంగా ఇప్పుడు మరోసారి ఏపీలో సమగ్ర సర్వే నిర్వహించే విధంగా జగన్ నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు.

 Jagan Conduct The Secret Survey In Ap About Corona Virus, Ap Cm Jagan Mohan Redd-TeluguStop.com

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం, అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్న వారి వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకునే విధంగా సర్వే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రస్తుతం కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడంతో స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం గా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.కేవలం నిత్యవసర సరుకులు తెచ్చుకునేందుకు ఇంటికి ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.అది కూడా మూడు కిలోమీటర్ల పరిధి వరకే అవకాశం కల్పించారు.మిగతా ఏ విషయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేకుండా కఠినమైన నిబంధనలు విధించారు.

ఇక ప్రస్తుతం ఏపీలో నిర్వహించబోతున్న సమగ్ర సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి వారిని క్వారంటెన్ సెంటర్లకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap Corona, Ashagrama, Corna Ap, Corona, Rs Ap-Political

అలాగే ప్రజలకు నిత్యావసరాలు, ఖర్చులకు ₹1000 అందించే విధంగా ఇప్పటికే జగన్ ఏర్పాట్లు చేశారు.గ్రామ వాలంటీర్ల ద్వారా వీటిని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఇప్పుడు ఈ సమగ్ర సర్వే ద్వారా కరోనా వ్యాప్తిని ఉదృతం చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా వైరస్ లక్షణాలు ఉన్నవారు ఎప్పుడు ఎవరిని కలిశారు అనే వివరాలను కూడా ప్రభుత్వం ఆరా తీసేందుకు సిద్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube