కరోనా కవరింగ్ : పత్రికలకు ఎన్ని కష్టాలో

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఏంటో ఇప్పుడు అనుభవపర్వకంగా తెలుసుకుంటున్నాయి పత్రికల యాజమాన్యాలు.అసలే నిర్వహణ భారం కావడంతో అష్ట కష్టాలు పడుతున్నాయి.

 Corona Effect On News Pappers, News Pappers, Corona Virus,-TeluguStop.com

చాలా పత్రికల నిర్వహణ పెనుభారంగా తయారయ్యాయి.ఒకవైపు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా పుంజుకోవడంతో పత్రికలు చదివే పాఠకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది.

అయినా ఏదో ఒక రకంగా వీటిని నిర్వహిస్తూనే వస్తున్నాయి.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు పత్రికలపై పడింది.

కరోనా వైరస్ వ్యాప్తి దిన పత్రికల ద్వారా ఎక్కువ అవుతోందని, అసలు ఆ వైరస్ న్యూస్ పేపర్లపై ఎక్కువ కాలం జీవించి ఉంటుంది అనే ప్రచారం తీవ్రం కావడంతో పత్రికలు కొనేవారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది.

అసలు కరోనా భయంతో ముద్రణ తరువాత వాటిని పంపిణీ చేసేందుకు కూడా పేపర్ బాయ్స్ ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

ఈ నేపథ్యంలో పత్రికలు ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు నిలిపివేస్తే మంచిదనే ఆలోచన ముందుగా పత్రికా యాజమాన్యాలు వచ్చాయి.అయితే ఒకసారి పత్రిక ముద్రణ నిలిపివేస్తే కొద్దిరోజుల తర్వాత మళ్ళీ ప్రారంభించినా పాఠకుల ఆదరణ మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని పత్రికల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి.

అందుకే న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందని ఆరోగ్య నిపుణులు, సెలబ్రెటీలతో తమ అనుబంధం ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల లోనూ అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి.

Telugu Coronaeffect, Corona, Channels, Pappers, Papper, Press-General-Telugu

కానీ జనాల్లోకి మాత్రం పత్రికల ద్వారా వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రచారం ఊపు అందుకోవడంతో వాటి జోలికి వెళ్లేందుకు సాహసించడం లేదు.దీంతో వీటి నిర్వహణ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.సరిగ్గా ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు పత్రికల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా వైరస్ కు సంబంధించి ప్రజలను మీడియా ద్వారా చైతన్యవంతం చేయాలంటూ సూచించారు.దీంతో ప్రధాని చెప్పిన తర్వాత కూడా పత్రికల ముద్రణ నిలిపి వేయడం కరెక్ట్ కాదు అనే వాదన ను పత్రికల యాజమాన్యాలు తీసుకు వస్తున్నాయి.

అందుకే పాఠకుల ఆదరణ తగ్గకుండా పత్రికల యాజమాన్యాలు అనేక తంటాలు పడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube