కరోనాపై పోరాటం కోసం సత్య నాదెళ్ళ భార్య భారీ విరాళం

కరోనాపై పోరాటానికి ఇప్పటికే ఇండియన్ మిలీనియర్స్ ముందుకి కదులుతున్నారు.వారికి తోచిన మార్గాలలో ప్రభుత్వానికి సహాయం అందించేందుకు ముందుకి వస్తున్నారు.

 Anupama Nadella Joins Fight Against Covid-19 In Telangana, Corona Effect, India-TeluguStop.com

ఇక తమిలానాడులో రజినీకాంత్ ఇప్పటికే సహాయం చేసారు.ఆయన దారిలోనే చాలా మంది నటులు వెళ్తున్నారు.

తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కేవలం నితిన్ మాత్రమే రెండు రాష్ట్రాలకి చేరు పది లక్షలు విరాళంగా ఇచ్చారు.మిగిలిన హీరోలు ఇప్పటి వరకు ముందుకి రాలేదు.

ఇకపై వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.మరి టాలీవుడ్ లో ఎవరు ముందుకొచ్చి విరాళాలు అందిస్తారు అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ళ భార్య భారీ విరాళం కరోనాపై పోరాటం కోసం తెలంగాణ ప్రభుత్వానికి అందించారు.

అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యనాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ను లీడ్ చేస్తున్నారు.ఆయన భార్య అనుపమ తెలంగాణ ప్రభుత్వానికి 2 కోట్ల విరాళం ప్రకటించారు.

ఈ మేరకు ఆ చెక్కును అనుపమ తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కేసీఆర్ కి అందజేశారు.ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ఈ చెక్కును వారు అందజేశారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్ ను వేణుగోపాల్ కలిసి ఈ చెక్కుని అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube