చిరు చిన్న అల్లుడుతో రొమాన్స్ చేయబోతున్న చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లి కూతురు అనే హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ అవికా గొర్.ఆ తరువాత అదే క్రేజ్ తో ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సక్సెస్ అందుకున్న ఈ ముంబై పిల్ల తరువాత కొంత కాలం పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా కుర్ర హీరోలతో ఆడిపాడింది.

 Avika Gor Romance With Kalyan Dev, Tollywood, Telugu Cinema, Mega Family, Megast-TeluguStop.com

అయితే షేప్ అవుట్ అయిపోవడంతో దర్శకులు ఈ అమ్మడుని పక్కన పెట్టారు.ఇతర ముంబై భామల తరహాలో గ్లామర్ పాత్రలకి సెట్ కాకపోవడం కూడా అవికా మైనస్ అని చెప్పాలి.

ఇదిలా ఉంటే కొంత కాలం పాటు తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ లో ట్రై చేసిన ఈ అమ్మడుని అక్కడ పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు.దీంతో కాస్తా లుక్, మార్చుకొని బాడీ షేప్ మార్చుకొని ఈ సారి మరింత గ్లామర్ గా రంగంలోకి దిగింది.

వచ్చి రావడంతోనే తన గ్లామర్, హాట్ ఫోటోషూట్ లతో దర్శకులకి సిగ్నల్ పంపించింది.ఇక ఈమె ప్రయత్నాలు మొత్తానికి ఫలించాయి.

ఊహించని విధంగా ఏకంగా చిరంజీవి మేనల్లుడు కళ్యాణ్ దేవ్ తో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.ప్రస్తుతం సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్న కళ్యాణ్ దేవ్ నెక్స్ట్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అవికా గొర్ ని ఫైనల్ చేసుకున్నారు.మరి ఈ సినిమా అమ్మడుకి ఎంత వరకు బ్రేక్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube