5 వేల మంది కొంపముంచిన ఆంటీ

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే.చైనాలో కనుగొనబడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.

 Woman Spreads Corona To 5 Thousand People In South Korea-TeluguStop.com

ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కొన్ని లక్షల మంది పడగా, వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి.ప్రతి ఒక్క దేశం తమ ప్రజలను సురక్షితంగా ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఈ మహమ్మారి సోకిన వారిని వెంటనే గుర్తించి వారిని ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికత్స అందించేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

అయితే ఓ ఆంటీ మాత్రం కరోనా వైరస్‌న నిర్లక్ష్యం చేయడంతో ఆమె ఇప్పుడు ప్రపంచంలోని ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.

దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళ ఫిబ్రవరి 6న ఒక ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరగా, ఆమెకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.కాగా ఆమె దానిని పట్టించుకోకుండా ఓ చర్చికి వెళ్లింది.

అక్కడ సుమారు 1200 మందికి పైగా పోగు కావడంతో వారందరికీ ఈ వైరస్ సోకింది.

అంతేగాక ఆమె తన స్నేహితులతో కలిసి ప్రేమికుల రోజున ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేసింది.

దీంతో మరికొంత మందికి కూడా ఈ వైరస్ సోకింది.ఇలా ఆమె వల్ల ఏకంగా 5000 మందికి కరోనా సోకినట్లు దక్షిణ కొరియా అధికారులు, వైద్యులు గుర్తించారు.

ఇలా ఇంతమందికి కరోనా సోకడానికి కారణమైన ఆ ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, బయటకు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు హెచ్చరించారు.

కాగా మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.అయితే మరింత కఠన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube