లాక్ డౌన్ ని సీరియస్ గా తీసుకోండి... ప్రధాని సూచన

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలో చాలా రాష్ట్రాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.అన్ని రకాల సర్విస్ లని రద్దు చేస్తూ ప్రజలని ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసాయి.

 Pm Modi Warns People To Take Corona Virus Lock-down, Corona Effect, Covid-19-TeluguStop.com

నిత్యావసర సరుకుల కోసం తప్ప ప్రజలు బయటకి రావొద్దని మర్యాదగా సూచనలు చేసాయి.అయితే ఇండియాలో కనీసం జాగ్రత్త లేని చాలా మంది ప్రజలు లాక్ డౌన్ అనే విషయాన్ని పట్టించుకోకుండా వీధుల్లోకి రావడం, ప్రయాణాలు చేయడం మొదలెట్టారు.

ఇష్టారాజ్యంగా నగరాలలో యువత రోడ్లు మీదకి వచ్చి హడావిడి చేసారు.అవసరం లేకపోయినా ఇంటి నుంచి బయటకి రావడంపై ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి.

దీంతో తక్షణం 144 సెక్షన్ ని అమల్లోకి తీసుకొచ్చాయి.కొన్ని చోట్ల 188 అమల్లోకి తీసుకొచ్చి.

రోడ్లు మీదకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం మొదలెట్టారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష కూడా వేయాలని కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు.

దీనిపై పోలీస్ అధికారులకి, కలెక్టర్ లకి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు.ఇదిలా ఉంటే లాక్ డౌన్ ని కాతరు చేయకపోవడంపై ప్రధాని మోడీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్‌ను చాలా మంది ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు.దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

మీ కుటుంబాల్ని కాపాడుకోండి.పరిస్థితి తీవ్రంగా ఉంది.

దీనిని అందరూ సీరియస్‌గా తీసుకోవాలి.కేంద్రం ఇచ్చిన సూచనలు, డాక్టర్లు ఇస్తున్న హెచ్చరికలను పాటించండి.

నిబంధనలు, చట్టాలు తప్పనిసరిగా అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని సూచించారు.అవసరం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఇప్పుడు పోలీసులు వారి యాక్షన్ మరింత సీరియస్ గా అమలు చేయడం మొదలెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube