'హైదరాబాద్'లో ఆదివారం విద్యుత్‌ వినియోగం ఎంతో తెలుసా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి భారత్ ను వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నిన్న దేశంవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించడంతో నిన్న ఉదయం నుండి రాత్రి 9 గంటల వరుకు కూడా ప్రజలంతా ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.

 Low Power Consumption In Hyderabad On Sunday-TeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆదివారం విద్యుత్ గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వార్త ఏంటి అంటే? జనతా కర్ఫ్యూ కారణంగా హైదరాబాద్‌ నగరంలో నిన్న విద్యుత్‌ వినియోగం దాదాపు అరవై శాతానికి పడిపోయింది అని సమాచారం.సాధారణ రోజుల్లో కంటే శని, ఆదివారాల్లో అత్యంత దారుణంగా విద్యుత్ వినియోగం తక్కువ ఉంటుంది.

ఇంకా ఈ ఆదివారం కర్ఫ్యూ కారణంగా తక్కువ వినియోగం అయ్యింది.

నిజం చెప్పాలి అంటే కర్ఫ్యూ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి విద్యుత్ వినియోగం పెరగాలి.కానీ అతి దారుణంగా విద్యుత్ వినియోగం తగ్గింది.అయితే ఇలా తగ్గడానికి కారణం పరిశ్రమలు, కార్యాలయాలు, మాల్స్‌ మూతపడడం కారణంగా వినియోగం తగ్గింది అని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube