పొత్తు లేకపోతే చిత్తే ? క్లారిటీ తెచ్చుకున్న బాబు ?

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల ముందు వరకు ఎప్పుడూ ఎన్నికల బరిలోకి ఒంటరిగా దిగింది లేదు.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మాత్రమే ఆయన ముందుకు వెళ్లారు.

 Chandrababu Want To Alliance With Cpm Party-TeluguStop.com

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరు సాగించారు.దీంతో చేదు ఫలితాలను తెలుగుదేశం పార్టీ మూట కట్టుకోవలసి వచ్చింది.

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పొత్తులే ప్రధాన బలంగా ఉంటూ వస్తున్నాయి.కొన్ని సార్లు పొత్తులు సక్సెస్ అయినా మరికొన్నిసార్లు వికటించినా ఎప్పుడూ పొత్తులను నమ్ముకుని టిడిపి ముందుకు వెళ్తోంది.

మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Telugu Chandrababu, Janasenabjp, Tdp Cpm, Tdp-Political

అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ స్థాయిలో ఫలితాలు ఎప్పుడు రాలేదు.దీంతో వాస్తవం ఏంటి అనేది టిడిపి నాయకులతో పాటు చంద్రబాబుకు ఒక క్లారిటీ వచ్చింది.అందుకే ఇకపై ఏదో ఒక పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే స్పష్టమైన క్లారిటీకి టిడిపి అధినేత చంద్రబాబు వచ్చేశారు.

ఈ నేపథ్యంలో తమకు మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న వామపక్ష పార్టీలను చేరదీయాలని చంద్రబాబు భావించారు.అందుకే తమతో పాటు అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సిపిఐ నాయకులందరినీ బాబు బాగా కాకా పడుతున్నారు.

మొన్నటి వరకు తమకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అండగా ఉంటూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో చంద్రబాబు ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Telugu Chandrababu, Janasenabjp, Tdp Cpm, Tdp-Political

గతంలో తమతో పొత్తు పెట్టుకున్నా ప్రస్తుతం దూరంగా ఉంటూ వస్తున్న సిపిఎం ను మచ్చిక చేసుకుని తమతో కలిసి వస్తున్న సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడంతో టిడిపి అగ్ర నాయకుల నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు అందరూ తీవ్ర నిరాశా నిస్పృహల్లో మునిగిపోయారు.కమ్యూనిస్టులకు ఏపీలో పెద్దగా బలం లేకపోయినా కాస్తోకూస్తో ఓటుబ్యాంకు ఉంది.

దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ తమకు కాస్తోకూస్తో కలిసి వస్తాయని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకు పడినా మరి కొద్ది రోజుల్లో అయినా ఎన్నికల తంతు మొదలవుతుంది.

అప్పుడు ఈ పొత్తు ద్వారా మరికొన్ని సీట్లు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube