ఆర్ఆర్ఆర్ లీకులు కేవలం ఎన్టీఆర్‌పైనే.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు పడిగాపులు కాస్తున్నారు.

 Leaks From Rrr On Ntr Not On Ram Charan-TeluguStop.com

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు వచ్చినా ప్రేక్షకులు వదలట్లేదు.

కాగా ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న గెటప్, పులితో ఆయన చేసిన ఫైట్ వంటి ఫోటోలు లీక్ కావడంతో చిత్ర యూనిట్ సీరియస్ అయ్యింది.

అయితే ఇక్కడ అందరికీ ఒక విషయం సస్పెన్స్‌గా మారింది.ఈ సినిమాలో వచ్చిన లీకులు అన్నీ కూడా కేవలం తారక్‌కు సంబంధించినవే ఎందుకు ఉన్నాయి? చరణ్ చేస్తున్న సీతారామరాజు పాత్రకు సంబంధించి ఎలాంటి లీకులు రాలేదు.

దీంతో కేవలం తారక్‌కు సంబంధించిన లీకులు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? అనే ప్రశ్నకు సినీ వర్గాలు కూడా తమదైన కారణాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో జక్కన్న ఎక్కువ ప్రాధాన్యత తారక్‌కు ఇచ్చాడని, అందుకే తారక్ పాత్రపై హైప్ క్రియేట్ అయ్యేలా ఈ స్ట్రాటెజీని ఉపయోగిస్తున్నారని వారు అంటున్నారు.

అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని, ఆయన సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించారిన చిత్ర వర్గాల సమాచారం.

చరణ్ పాత్రతో ఆర్ఆర్ఆర్ ఇచ్చే సర్‌ప్రైజ్‌ను దూరం చేయకూడదనే ఉద్దేశ్యంతో ఆయన పాత్రకు సంబంధించి ఎలాంటి లీకులు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతున్నారని పలువురు అంటున్నారు.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ లీకులు కూడా కొత్త వివాదానికి తెరలేపడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, ఒలివియా మారిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తు్న్నారు.

డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube