నన్ను దాటాలంటే ముందు ఆ మెట్రిక్స్ దాటాలన్న హైపర్ ఆది...

తెలుగులో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో  ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికీ బాగా తెలుసు.అయితే ఇందులో హైపర్ ఆది కూడా తన స్కిట్లతో వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు ఎంతగానో అలరిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Hyper Aadi Counter To The Adirindi Saddam-TeluguStop.com

అయితే తాజాగా ఇటీవలే జీ తెలుగులో  ప్రారంభమైన “అదిరింది” అనే కామెడీ షో కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.అయితే ఇందులో గల్లీ బాయ్స్ లో నటిస్తున్నటువంటి సద్దాం హుస్సేన్ కూడా ప్రస్తుతం యూట్యూబ్ లో బాగానే ట్రేడింగ్ అవుతున్నాడు.

అయితే తాజాగా సద్దాం హుస్సేన్ నటించినటువంటి ఓ స్కిట్టులో హైపర్ ఆదిపై పంచులు పేల్చాడు.ప్రస్తుతం ఈ స్కిట్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో హైపర్ ఆది పాల్గొన్నాడు.ఇందులో భాగంగా గా ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఈ మధ్యకాలంలో అదిరింది షోలో కమెడియన్ గ చేస్తున్నటువంటి సద్దాం హుస్సేన్  మిమ్మల్నికూడా దాటుతున్నాడు అంటూ ప్రశ్న అడిగింది.

అయితే అందుకు హైపర్ ఆది సమాధానం చెబుతూ స్క్రిప్ట్ పరంగా నాపై పంచులు పెల్చుండొచ్చుగానీ నన్ను దాటాలంటే మాత్రం కొన్ని మెట్రిక్స్ ఉన్నాయని ఆ మెట్రిక్స్ దాటిన తర్వాత అప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుస్తుందని అన్నాడు.

https://web.whatsapp.com

Telugu Abardasthhyper, Adirindi Show, Hyper Aadi, Hyperaadi, Saddam-Movie

అయితే ఇంతకీ ఆ మెట్రిక్స్ ఏంటో కూడా వివరిస్తూ తాను జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దాదాపుగా 130 స్కిట్లు పైగా చేశానని, ఇందులో 40 స్కిట్లకి యూట్యూబ్ లో కోటి వ్యూస్ వచ్చాయని తెలిపాడు.అలాగే మరో నాలుగు స్కిట్లు 30 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినవి ఉన్నాయని, ఇప్పటివరకు తన కెరీర్లో  ఒక్క స్కిట్ కి అత్యధికంగా గా58 మిలియన్ల వ్యూస్ వచ్చాయని కూడా తెలిపాడు.

అంతేగాక ఇది ఏదో 5 వారాల హడావిడి కాదని దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటెన్ చేస్తున్నామని, ఈ మెట్రిక్స్ దాటితే అప్పుడు తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే హైపర్ ఆది ఒకపక్క జబర్దస్త్ స్కిట్ లో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube