కరోనా సమాచారం: 30 భాషల్లోకి ట్రాన్స్‌లేషన్, అమెరికాలో భారతీయ విద్యార్ధిని వినూత్న ఆలోచన

ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ పంజాకి చిక్కి విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.అన్ని రంగాలు దీని ప్రభావానికి గురై అంతిమంగా ఆర్ధిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.

 Indian American Led Team Translating Coronavirus Information In 30 Languages 19-TeluguStop.com

కరోనా కారణంగా ప్రపంచం నెమ్మదిగా ఆర్ధిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కరోనా అప్‌డేట్స్, నివారణ, ముందు జాగ్రత్త చర్యల కోసం నెట్టింట తెగ బ్రౌజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ప్రథమ సంవత్సరం చదువుతున్న భారత సంతతి అమెరికన్ వైద్య విద్యార్ధిని సమాజం కోసం వినూత్నంగా ఆలోచించింది.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వారు అమెరికాలో స్థిరపడిన సంగతి తెలిసిందే.

వీరందరిని దృష్టిలో పెట్టుకుని హిందీతో సహా 30 భారతీయ భాషల్లో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని వలసదారులకు అందించే ప్రయత్నాన్ని ఈమె ప్రారంభించింది.ఈ విద్యార్ధిని పేరు పూజా చంద్రశేఖర్ ఈమె నేతృత్వంలో సుమారు 150 మంది మెడికల్ విద్యార్ధు బృందం కోవిడ్-19 ఫాక్ట్ షీట్లను అభివృద్ధి చేసి వాటిని 30 భాషల్లోకి అనువదిస్తున్నారు.

Telugu Languages, Covid, Covid Info, Ndian American-

ఇందులో హిందీ, తెలుగు, మలయాళం, బెంగాలీ, పంజాబీ, తమిళం, మరాఠీ, ఉర్దూ తదితర భారతీయ భాషలు ఉన్నాయి.కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్నందున వివిధ భాషలలో అందుబాటులో ఉన్న ఆరోగ్య సమాచారాన్ని ఒకే చోటికి చేర్చడమే తమ లక్ష్యమని పూజ చెప్పారు.వివిధ భాషల్లోకి అనువదించిన సమాచారాన్ని స్వచ్ఛంద సంస్థలు, క్లినిక్‌లకు అందిస్తామని ఆమె తెలిపారు.కరోనా నివారణ, కరోనా అంటే ఏమిటి, నిర్వహణ, చిన్నారులు, గర్బిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనువదించేందుకు వైద్య విద్యార్ధుల బృందం పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తోంది.

భారతీయ భాషలతో పాటు, వీటిలో స్పానిష్, మాండరిన్ చైనీస్ (సరళీకృత), మాండరిన్ చైనీస్ (సాంప్రదాయ), ఫార్సీ, ఫ్రెంచ్, అరబిక్, ఫిలిపినో, కొరియన్, మలయ్, జర్మన్, రష్యన్, వియత్నామీస్, ఇటాలియన్, పోర్చుగీస్, అర్మేనియన్, క్రియోల్, స్వాహిలి, నవజో, ఇండోనేషియా మరియు గ్రీకు భాషల్లోనూ కోవిడ్-19కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు.వచ్చే వారం నాటికి మెటీరియల్ మొత్తం సిద్ధం చేయాలని పూజా బృందం భావిస్తోంది.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటి తాజా గణాంకాల ప్రకారం… ప్రస్తుతం అమెరికాలో 9,077 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 145 మంది మరణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube