మళ్లీ బిస్కెట్ అంటోన్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి తెరెకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ జనాలే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

 Rajamouli To Disappoint Once Again-TeluguStop.com

సినిమా షూటింగ్ మొదలై కొన్ని నెలలు గడుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్‌డేట్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ప్రతి పండగకు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిలించారు చిత్ర యూనిట్.అయితే ఈసారి కూడా అదే జరిగేలా ఉందని అంటున్నాడు చిత్ర దర్శకుడు రాజమౌళి.

మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయంతో కొట్టుమిట్టాడుతుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం సరైన సమయం కాదని రాజమౌళి భావిస్తు్న్నాడట.

దీంతో ఈసారి కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఉసూరుమనిపించనుంది.

ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.

డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube