చికెన్ తో కరోనా అని నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.తెలంగాణ రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.

 Will Give One Crore Anyone Who Prove Eating Chicken Causes Corona-TeluguStop.com

చికెన్ తింటే కరోనా వ్యాపిస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడంతో చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి.కిలో 30 రూపాయలకు విక్రయించినా కొనేవాళ్లు కరువయ్యారు.

చికెన్ తింటే కరోనా రాకపోయినా జరుగుతున్న ప్రచారం వల్ల నష్టాలు వస్తూ ఉండటంతో తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో గుడ్ల కోళ్ల సంఘం అధ్యక్షుడు ముత్తుస్వామి చికెన్ తినడం వల్ల కరోనా సోకుతుందని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా తమకు తీవ్ర నష్టాలు వస్తూ ఉండటంతో ఈ ప్రకటన చేసినట్లు ముత్తుస్వామి చెబుతున్నారు.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు కరోనాకు భయపడి చికెన్, గుడ్లు తినడం లేదని అన్నారు.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతుల వల్ల చికెన్ ధర కిలో 20 రూపాయలకు పడిపోయిందని ఫారం యజమానులతో పాటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube