అమెరికాలో మరింత పెరిగిన కరోనా మరణాలు

అగ్రరాజ్యం అమెరికా లో కరోనా వైరస్ మరణాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఒకరు మృతి చెందినట్లు వార్తలు వినిపించగా తాజాగా ఈ సంఖ్య ఆరుకు పెరిగినట్లు తెలుస్తుంది.

 6 Corona Patients Deaths Occurs In America-TeluguStop.com

అయితే మృతులు అందరూ కూడా వాషింగ్టన్ వాసులు లాగా అధికారులు చెబుతున్నారు.ఒకరి మృతితోనే కరోనా కు యాంటీ వైరల్ డ్రగ్ ని కనిపెట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా ఆరుగురు మృతి చెందడంతో ట్రంప్ సర్కార్ మరింత అప్రమత్తమైంది.పసిఫిక్ నార్త్ వెస్ట్ నుంచి ఈ కేసులు బయటపడ్డాయని అధికారులు చెబుతన్నారు.

మరోపక్క ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా కరోనా వ్యాధికి చికిత్స వేసవి నాటికి అందుబాటులోకి వస్తుంది అని ప్రకటించారు.ముఖ్యంగా ఇటలీ, దక్షిణ కొరియా నుంచి విమానాల్లో వస్తున్న ప్రయాణికులను స్క్రీనింగ్ చేసే ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు.

ఇటలీలో 1700, సౌత్ కొరియాలో నాలుగువేల కరోనా కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు.కాగా-ఇటీవలే ఇరాన్ నుంచి అమెరికాకు వఛ్చిన ఓ మహిళ.

కరోనా వ్యాధితో మరణించింది.

వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ, సీటెల్, స్నోమిష్ కౌంటీలకు చెందిన వ్యక్తులు ఈ వైరస్ లక్షణాలు సోకి మృతి చెందారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

‘గిలీడ్’ అనే ఫార్మాసిటికల్ సంస్థ డెవలప్ చేసిన యాంటీ వైరల్ డ్రగ్.‘రెమిడిసివిర్’ గురించి ప్రస్తావించిన ఆయన.దీన్ని ఇప్పటికే రోగులకు వాడుతున్నట్టు తెలుస్తుంది.అయితే పూర్తి స్థాయిలో ఈ యాంటీ డ్రగ్ ను తయారు చేయాలి అంటే మాత్రం వేసవి నాటికి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube