ఫేస్‌బుక్‌ పరిచయం.. రెండు ప్రాణాలు పోయాయి!

ఎంత చెప్పిన ఈ ప్రజలకు అర్థం అవ్వడం లేదు.ఫేస్‌బుక్‌, వాట్సాప్ పరిచయాలు అంత మంచివి కాదు అమ్మ.

 Facebook Friend Blackmail Married Women In Mahabubnagar-TeluguStop.com

దుర్మార్గులు ఉంటారు అని చెప్పిన అమ్మాయిలు.వివాహితలు అవి పట్టించుకోకుండా కొత్త ఫ్రెండ్స్ ను చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.అలాంటి ఘటనే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వెంకటరమణ కాలనీకి చెందిన రాగసుధకు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రేమ్‌నగర్‌కు చెందిన బలగం ఉదయ్‌ కుమార్‌తో 2011లో వివాహం అయ్యింది.

ఈ దంపతులకు 5 ఏళ్ళ కుమారుడు రోహిన్‌ ఉన్నాడు.ఉదయ్‌ కుమార్‌ ఓ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే రాగసుధ గృహిణి.సంవత్సరం క్రితం రాగ సుధాకు ఫేసుబుక్ ద్వారా కార్తీక్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు.

ఆ యువకుడు ప్రాంతం గద్వాల్.అయితే కార్తీక్ తీరు రాగసుధకు నచ్చక కొద్దీ రోజులకే అతన్ని బ్లాక్ చేసింది.

కానీ కార్తీక్ మాత్రం ఫోన్‌ చేసి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరించాడు.

దాదాపు సంవత్సరంలోనే లక్ష రూపాయిలు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లాగాడు.

దీంతో ఆమె బాధను ఆమె స్నేహితుడు రవికి చెప్పింది.ఆ రవి రెండు రోజుల కిందట ఆ కార్తీక్ ని చంపి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

అయితే పోలీసులు అతన్ని విచారించగా ఆ విచారణలో రాగ సుధా పేరు బయటకు రావటంతో ఆమెను విచారణ కోసం మహబూబ్‌నగర్‌కు రావాలని పోలీసులు చెప్పారు.

దీంతో మనస్థాపానికి గురైన రాగసుధ ”నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.

నా కొడుకును బాగా చూసుకోండి.నేనే తప్పు చేయలేదు.

నన్ను అందరూ క్షమించండి” అని సూసైడ్‌ నోట్‌ రాసి ప్రేమ్‌ నగర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఇలా ఫేస్బుక్ పరిచయం ఇద్దరి ప్రాణాలను తీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube