హరీష్ రావు మద్దతుకు కేటీఆర్ ఆరాటం ? ఆ భయమే కారణమా ?

త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కేటీఆర్ అందుకు తగ్గట్టుగానే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.తాను ముఖ్యమంత్రి కావడాన్ని పార్టీలోని మెజారిటీ నాయకులు సమర్థిస్తూ వస్తున్నా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెసిఆర్ మేనల్లుడు అయినా హరీష్ రావు ఈ వ్యవహారంలో గుర్రుగా ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి.

 Ktr Fears About Harish Rao-TeluguStop.com

ఇదే విషయం కేటీఆర్ కు సైతం తెలిసినా ఈ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు.అయితే ఈ వ్యవహారంలో బీజేపీ కూడా పావులు కదుపుతున్నట్లు కేటీఆర్ కు సమాచారం అందడంతో ఇప్పుడు తన బావ హరీష్ రావు మద్దతు కోసం ఆయన ఆరాట పడుతున్నట్టు తెలుస్తోంది.

టిఆర్ఎస్ లో హరీష్ రావుకు కూడా ఒక వర్గం ఉంది.అందుకే కేటీఆర్ కూడా కాస్త భయ పడుతున్నట్లు తెలుస్తోంది.కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తే హరీష్ రావు వర్గం తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు కేటీఆర్ అనుమానిస్తున్నారు.ఇక ఇదే సమయంలో బిజెపి కూడా హరీష్ రావు కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని, శాసనసభ్యుల బలం లేకపోయినా కేంద్రం నుంచి మద్దతు తెలపాలని బిజెపి రాజకీయ ఎత్తుగడలు వేస్తోందని కేటీఆర్ అనుమానిస్తున్నారు.

ఆ ఆలోచనతోనే ఇప్పుడు హరీష్ రావును మచ్చిక చేసుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లు దానిలో భాగంగానే హరీష్ రావు వద్దకు కొంతమంది కీలక నాయకులను కేటీఆర్ వద్దకు రాయబారం పంపినట్టు వార్తలు వస్తున్నాయి.హరీష్ రావు మద్దతు కూడా తనకు పూర్తిగా లభిస్తే తెలంగాణ సీఎం పీఠంపై ఎటువంటి బయన్దోళనలు లేకుండా కూర్చోవచ్చని కేటీఆర్ ఆలోచన.

ఇప్పుడే కాకుండా ముందు ముందు కూడా హరీష్ రావు తో ఎటువంటి విభేదాలు లేకుండా ఐకమత్యంతో కలిసి ముందుకి వెళ్లాలా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వ్యవహారం లో బీజేపీ వేలు పెట్టకుండా, హరీష్ రావు పూర్తి మద్దతు పొంది భవిష్యత్తులోనూ ఎటువంటి విబేధాలు లేకుండా చూసుకోవాలని కేటీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube