మంగ్లీ మెసేజ్ బాగున్నా ఎందుకో ప్రేక్షకులకు నచ్చడం లేదు..

తాజాగా తెలంగాణ ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ హీరోయిన్ గా నటించిన టువంటి చిత్రం “స్వేచ్ఛ”.ఈ చిత్రానికి దర్శకుడు కెప్టెన్ చౌ హాన్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాడు.

 Mangli Swechha Movie Talk-TeluguStop.com

ఈ చిత్రాన్ని నిర్మాత రాజు నాయక్ నిర్మించాడు.ఈ రోజున ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చినటువంటి స్వేచ్ఛ థియేటర్లలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.అంతేగాక ఈ చిత్రంలో మంగ్లీ బంజారా తెగలో జన్మించినటువంటి ఆడపిల్ల పడేటువంటి కష్టాలు మరియు ఆడపిల్లలకు కావలసిన స్వేచ్ఛ వంటి అంశాలపై పోరాడుతున్టువంటి యువతి పాత్రలో నటించింది.

ప్రేక్షకులను తన పాటలతో ఎప్పుడూ  ఆకట్టుకునే మంగ్లీ ఈసారి తన నటనతో బాగానే మెప్పించనదని చెప్పుకోవచ్చు.

Telugu Swechha, Swechha Latest, Swechha Mangli-Movie

అయితే మరోపక్క ఈ రోజున హీరో విశ్వక్ సేన్ హిట్ చిత్రం, అలాగే నటుడు ధనుష్ నటించిన టువంటి లోకల్ భాయ్ చిత్రం కూడా ఈ రోజే విడుదలైంది.దీంతో ఈ చిత్రాల పోటీని తట్టుకోలేక  స్వేచ్ఛ కొంతమేర వసూళ్లు సాదించడంలో చతికిల పడుతోంది.కానీ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను చూసేటువంటి ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా నప్పుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube