భీష్మ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో నితిన్ అదిరిపోయే హిట్ కొడతాడని అభిమానులు ముందు నుండే అంచనాలకు వచ్చారు.

 Bheeshma First Week Worldwide Collections-TeluguStop.com

అనుకున్నట్లుగానే ఈ సినిమాతో నితిన్ సూపర్ సక్సెస్‌ను కొట్టాడు.ఛలో వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించిన వెంకీ కుడుముల మరోసారి అదే జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.

అందాల భామ రష్మిక మందన కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో భీష్మ చిత్రంపై ప్రేక్షకులు పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్ రావడం, పోటీలో మరే సినిమా లేకపోవడంతో భీష్మ అన్ని చోట్ల అదిరిపోయే వసూళ్లను సాధించింది.తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.23.75 కోట్ల మేర వసూళ్లు సాధించింది.నితిన్ కెరీర్‌లో భీష్మ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మొదటి వారం ముగిసే సరికి కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 7.50 కోట్లు

సీడెడ్ – 2.85 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.58 కోట్లు

ఈస్ట్ – 1.43 కోట్లు

వెస్ట్ – 1.19 కోట్లు

గుంటూరు – 1.54 కోట్లు

కృష్ణా – 1.33 కోట్లు

నెల్లూరు – 0.59 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 19.02 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 1.75 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ – 3 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 23.75 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube