హృతిక్ అడుగుజాడల్లో ప్రభాస్.. ఎంతవరకు మెప్పిస్తాడో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో జాన్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

 Prabhas To Do Super Hero Film With Nag Ashwin-TeluguStop.com

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వకుండానే మరో సినిమాకు ప్రభాస్ పచ్చ జెండా ఊపాడు.మహానటి చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే అన్నాడు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎవ్వరూ ఊహించని పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాతో బాహుబలిని మించిపోయేందుకు ప్రభాస్‌ను సిద్ధం చేస్తాడట నాగ్ అశ్విన్.ఇంతకీ ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే పాత్ర ఏమిటా అని అనుకుంటున్నారా? బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ చేసిన క్రిష్ తరహా పాత్రలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా నటించనున్నాడట.

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.మరి ప్రభాస్‌ను మనకు నాగ్ అశ్విన్ ఎలాంటి సూపర్ హీరోగా చూపిస్తాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube